Posts

తెలుగు సామెతలు

Image
తెలుగు సామెతలు అభ్యాసం కూసు విద్య అడుసు తొక్కనేల కాలు కడగనేల అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అడగందే అమ్మ అయినా పెట్టదు అతి వినయం ధూర్త లక్షణం అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు అనువు గాని చోట అధికులమనరాదు అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు. అటునుండి నరుక్కు రా అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అగ్నికి వాయువు తోడైనట్లు అతగాడే ఉంటే మంగలెందుకు అక్క మనదైతే బావ మనవాడా? అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అత్త సొమ్ము అల్లుడు దానం అడకత్తెరలో పోకచెక్క అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు అనుమానం పెనుభూతం అన్నీ స...

Sumathi Satakam

Image
సుమతీ శతకం కవి పేరు బద్దెన ఆంగ్లంలో పేరు SUMATHI SATAKAM వ్రాయబడిన సంవత్సరం సుమారు క్రీ.శ.1260 దేశం భారత దేశము భాష తెలుగు మకుటం సుమతీ విషయము(లు) నీతి పద్యములు పద్యం/గద్యం పద్యములు ఛందస్సు కంద పద్యములు మొత్తం పద్యముల సంఖ్య శతకం అంతర్జాలం లో telugustoresmama.blogspot.com అక్కరకురాని చుట్టము, మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా నెక్కిన బాఱని గుఱ్ఱము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ. భావం - అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము,ఎంత ప్రార్దించినా వరమియ్యని దేవతా,మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను. 2 అప్పిచ్చువాడు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ. భావం -అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము. 3 శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ. భావం ...

GONA VEMANA REDDY

Image
Gona Vema Reddy  , popularly known as  Vemana  was born on 25 August in 1652 Nellore. He was a major Telugu  philosopher  and poet writing in  Telugu . ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులువేరయ విశ్వదాభిరామ వినుర వేమ భావం - ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు. 2 గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేల ఖరముపాలు భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ భావం - కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. 3 ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభి రామ వినుర వేమ భావం - మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన) 4 అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగ...
Image
అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది. ఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది. కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది. కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది. రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతికి ఒక ఐడియా వచ్చింది. ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దెగ్గిర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి. అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు.